వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌, పోలీసులకు క్లీన్‌చిట్‌పై పున:పరిశీలన

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మావోయిస్టు నేత చెరుకూరి రాజకుమార్ అలియాస్ ఆజాద్, పత్రికా రచయిత హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై స్వతంత్ర విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ విచారణపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అనుమానాలు వ్యక్తం చేయడంతో న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం, రంజనా ప్రకాష్ దేశాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్వతంత్ర విచారణకు ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది.

ఐపియస్ అధికారులు హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటారని, అందువల్ల సిబిఐ విచారణను హోం మంత్రి ప్రభావితం చేసి ఉంటారనే అనుమానం ఉందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. సిబిఐ సమర్పించిన నివేదికలో పలు లొసుగులు ఉన్నాయని, ఎదురుకాల్పులు నిజంగానే జరిగాయని సిబిఐ చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర నిర్ధారణలు హోం మంత్రి ప్రభావంతో జరిగి ఉంటాయనే అనుమానం ఉందని ఆయన అన్నారు.

మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు ఆజాద్‌తో హోం మంత్రి టచ్‌లో ఉన్నారని, హోం మంత్రి ఆమోదం లేకుండా ఆజాద్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంపి ఉండరని ఆయన వాదించారు. హేమచంద్ర పాండే భార్య వినీతా పాండే తరఫున కోర్టులో వకాల్తా తీసుకున్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడానికి తొలుత కొర్టు అనాసక్తి ప్రదర్శించింది. ఆ తర్వాత రాతపూర్వకంగా తమకు సమర్పించాలని సూచించింది.

తాము సిిబఐ దర్యాప్తు నివేదికపై విచారణ జరపడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు తెలిపింది. సిబిఐ నివేదికను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది. ఆజాద్, పాండే 2010 జులైలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలో హతమయ్యారు. ఆజాద్ గానీ, పాండే గానీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని, నిజమైన ఎదురు కాల్పుల్లోనే మరణించారని సిబిఐ నిర్ధారించిందని సుప్రీంకోర్టు మార్చి 16వ తేదీన ప్రకటించింది.

English summary
The Supreme Court on Friday agreed to "consider" a plea for an independent probe into the killings of top Maoist leader Cherukuri Rajkumar alias Azad and scribe Hemchandra Pandey in an allegedly staged gun battle by the Andhra Pradesh police, who were given clean chit by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X