వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనోడని వదలొద్దు: వైయస్‌పై చిరంజీవి మంత్రి సిఆర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ramachandraiah
కడప: మనవాడు కదా అని పక్కన పెడితే చరిత్ర మనల్ని క్షమించదని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన కడప జిల్లాలోని రాజంపేటలో శనివారం రాత్రి జరిగిన కాంగ్రెసు పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైయస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
విరుచుకు పడ్డారు.

వైయస్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ధ్వజమెత్తారు. దోపిడీదారులను, వ్యక్తిత్వం లేని వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిని దోపిడీని సుప్రీంకోర్టుకు సిబిఐ తన చార్జిషీటులో వివరించిందని అన్నారు.

ఆ నిజాలను ఇలాంటి సమయంలో దాచలేమని ఆయన చెప్పారు. పార్టీ అండదండలతో అధికారాన్ని చేజిక్కించుకొని లక్ష కోట్ల అవినీతి చేసిన వారు తప్పక శిక్షార్హులేనన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్నవారిని తప్పక శిక్షించాలన్నారు. బానిస బతుకులు బతకలేమని, నచ్చని పక్షంలో ఎవరైనా సరే బయటకు పోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.

ప్రజల సొమ్మును దోచుకుని చానళ్లు, పేపర్లు, కర్మాగారాలు, వేలకోట్ల ఆస్తులు కూడబెట్టుకొన్న దోపిడీదార్ల గురించి ప్రజలకు చెప్పి తీరాల్సిందేనన్నారు. అలా చెప్పకపోతే ప్రజలు మనలను క్షమించరన్నారు. మనవాడు కదా అని పక్కన పెడితే చరిత్ర క్షమించదన్నారు. అవినీతిపరులను వెనుకేసుకు రావడం సరికాదన్నారు.

కాగా వైయస్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని మంత్రి కొండ్రు మురళీ శనివారం మరోసారి స్పష్టం చేశారు. ఇతర ముఖ్యమంత్రుల్లాగే వైయస్ హయాంలోనూ దళితులకు ఒరిగిందేమీ లేదన్నారు. వైయస్ హయాంలో దళితుల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లు రాకుండా ఆగిపోయాయన్నారు.

దళితులకు జరుగుతున్న అన్యాయాలు, దళితులు, గిరిజనులకు రావాల్సిన నిధుల విషయమై వైయస్‌ ఉన్నప్పుడే తాను అడిగానన్నారు. రెండు, మూడేళ్లుగా కొందరు దళితులు కాంగ్రెస్‌కు దూరమైన మాట వాస్తవమేనని చెప్పారు. ఎవరు ఏమనుకున్నా తన అభిప్రాయంలో మార్పు ఉండబోదన్నారు.

English summary
Minister C Ramachandraiah commented late chief minister YS 
 
 Rajasekhar Reddy on saturday. He participated in Congress 
 
 party meeting at Rajampet of Kadapa district. He fired at 
 
 YSR Congress Party chief YS Jaganmohan Reddy in party 
 
 meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X