మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి

పోలీసులు దారుణంగా హింసించడం వల్లనే రాంరెడ్డి మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు మాత్రం రాంరెడ్డి అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతున్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మియాపూర్ పోలీసులు రాంరెడ్డిని మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఈయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. మదీనాగూడకు చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఓ రైసు మిల్లు వ్యాపారి అని తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాంరెడ్డిని అరెస్టు చేశారు.
కాగా గతంలోనూ రాష్ట్రంలో పలు పోలీసు స్టేషన్లలో నిందితులు మృతి చెందడం, లాకప్ డెత్‌గా వారి బంధువులు ఆరోపించడం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం మెదక్ జిల్లాలో లాకప్ డెత్ సంఘటన జరిగింది. తాజాగా మరోసారి మియాపూర్ పోలీసు స్టేషన్లో నిందితుడు అనుమానాస్పద మృతి లాకప్ డెత్ కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications