వైయస్‌పై కాంగ్రెసు మరో రాయి: సురేఖపై గురి

Basvaraju Saraiah - Konda Surekha
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు పార్టీ రాయి విసిరింది. వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటే ప్రధానాస్త్రంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్‌ను పద్ధతి ప్రకారం దెబ్బ తీయాలనే ఎత్తుగడతో కాంగ్రెసు నాయకత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన తనను వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. తనకు మంత్రి పదవి దక్కకుండా చేస్తానని కూడా అన్నారని ఆయన అన్నారు. దీన్ని బట్టి వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్‌పై తెలంగాణాస్త్రం కూడా ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో జరిగే 18 శాసనసభా స్థానాల్లో పరకాల ఒక్కటే తెలంగాణలో ఉంది. పరకాలలో తమ పార్టీకి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతోనే బస్వరాజు సారయ్య ఆ మాటలు అని ఉండవచ్చునని అంటున్నారు.

కాంగ్రెసు పార్టీ విప్‌ను ధిక్కరించి జగన్‌కు మద్దతు పలుకుతున్న కొండా సురేఖపై వేటు పడడంతో పరకాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆమె తిరిగి పరకాల నుంచి పోటీ చేస్తున్నారు. సురేఖ బలమైన అభ్యర్థి కావడంతో ఆమెను ఓడించడానికి వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడం అవసరమని కాంగ్రెసు నాయకత్వం భావించి ఉండవచ్చునని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటుపైనే తాను పోటీ చేస్తానని సురేఖ ఇటీవల చెప్పారు. దీంతో వైయస్ సెంటిమెంటు సురేఖకు ఉపయోగపడకుండా సారయ్య వైయస్‌ను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నించి ఉండవచ్చునని అంటున్నారు.

కాగా, అయోమయం కన్నా ఒకవైపు కాదంటూనే మరో వైపు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్ట దెబ్బ తీసి వైయస్ జగన్‌కు కూడా ఉపయోగపడకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. కొండ్రు మురళి వంటి దళిత కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటే, వి. హనుమంతరావు వంటి సీనియర్ నాయకులు వైయస్ జగన్ అవినీతిలో వైయస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద, వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతిని దెబ్బ తీసే ప్రయత్నంలో కాంగ్రెసు ఉన్నట్లు కనిపిస్తోంది. పరకాలలో కొండా సురేఖను దెబ్బ తీయడం ఒకటి కాగా, మొత్తంగా వైయస్ జగన్‌ను దెబ్బ తీయడం రెండోదిదా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+