పువ్వాడ సిపిఐ పార్టీలో, తనయుడు జగన్ పార్టీలో

అజయ్ స్థానికంగా మమత మెడికల్ కాలేజ్ చైర్మన్‌గా ఉన్నారు. జిల్లాలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడంతోపాటు సిపిఐ ఓటు బ్యాంకు లక్ష్యంగా అజయ్‌కు జగన్ కీలకపాత్ర కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కుమారుడు ఆ పార్టీలో చేరడం వెనుక తండ్రి పరోక్ష ఆశీస్సులు ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు.
జిల్లాలో ఏఐఎస్ఎఫ్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగిన నాగేశ్వరరావు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులతో పాటు పార్టీ రాష్ట్ర, కేంద్ర కమిటీల్లో సభ్యుడుగానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనయుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యానే కీలక పదవుల నుంచి వైదొలిగారట. పార్టీ సభ్యుడిగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు ప్రస్తుతం పరిమితమై, తెర వెనుక తనయుడికి సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అజయ్ వైయస్ జగన్ పార్టీలో చేరకముందు ఒకటి రెండు సందర్భాల్లో పువ్వాడ తన ప్రసంగాల్లో వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసిస్తూ ప్రకటనలు కూడా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జిల్లాలో జగన్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి, ఆర్థిక సాయం అందించడంలో అజయ్ కొంత బాధ్యత పంచుకున్నట్లు ప్రచారం జరిగింది. జగన్‌పై అనేక అవినీతి ఆరోపణలు, సిబిఐ విచారణ సాగుతుండగా కమ్యూనిస్టు పార్టీ నేత తనయుడు ఆయన పార్టీలో చేరడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications