రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా చెప్పారు: వాయలార్‌రవి, తప్పని నిరసన సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
రాజమండ్రి: ఎన్నికలు జరిగి గెలుపొందాక కూడా ప్రజల వద్దకు వెళ్లాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో చెప్పారు. ఆయన కొయ్యలగూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఉన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా తాను వచ్చానని చెప్పారు. ప్రత్యేకంగా మిమ్మలను చూసేందుకే వచ్చానని చెప్పారు.

తాను చదువుకునే సమయంలో రోడ్లు, స్కూళ్లు ఉండేవి కావని, కానీ ఇప్పుడు అవన్నీ వచ్చాయన్నారు. మీరు పండించే పంటనే మేం తింటున్నామని చెప్పారు. స్థానికంగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. పొగాకు రైతు సమస్యలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో మాట్లాడతానని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తాను పర్యటిస్తున్నానని, ప్రజల కోసం పాటుపడే కాంగ్రెసును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

తాను మేనిఫెస్టో కమిటీ సభ్యుడినని, ఓ సందర్భంలో సోనియా మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో ఉన్న ఆహార భద్రతను దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహార భద్రతకు ఓ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. మీ గురించి ఆలోచించే పార్టీని బలపర్చమని కోరారు. అలా అయితే ప్రజల కోసం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

తన పర్యటన హాయిగా జరిగిందన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ లేకపోవడం వల్లనే తాను వచ్చానని చెప్పారు. తాను రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు ఇంచార్జిని కాదని చెప్పారు. పార్టీలో విభేదాలు ఉంటే పిసిసి చీఫ్, సిఎం సరిదిద్దుతారని చెప్పారు. అంతకుముందు రాజమండ్రి చేరుకున్న ఆయన 18 శాసనసభ స్థానాలు, నెల్లూరు ఎంపి స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ఒకటేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాయలార్ రవి ఆంగ్లంలో మాట్లాడగా ఎంపి కావూరి సాంబశివ రావు దానిని తెలుగులోకి తర్జూమా చేశారు. కాగా రాజమండ్రిలో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్సీలను గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీని రక్షించాలని వారు నినాదాలు చేశారు.

English summary

 Congress Party senior leader Vayalar Ravi said they all are following AICC president Sonia Gandhi's suggestions. He was participated in bypolls campaign meeting at Koyyalagudem of East Godavari district. PCC chief Botsa Satyanarayana participated in this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X