హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులి, ఖలేజా కోసం బెదిరింపు నిజమే!: భాను కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: షాలిమార్ వీడియో కంపెనీ వారిని బెదిరించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులు నటించిన పులి, ఖలేజా డివిడి హక్కులు పొందామని మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ సిఐడి పోలీసుల విచారణలో చెప్పారని తెలుస్తోంది. తాను ఇతరులతో కలిసి షాలిమార్ యాజమాన్యాన్ని బెదిరించానని ఆయన చెప్పారు. సినీ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని కూడా బెదిరించి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది.

అనిల్ అనే వ్యక్తి నుండి రెండు రివాల్వర్లు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారమే మద్దెలచెర్వు సూరిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. హత్య అనంతరం బుజ్జి నుంచి రూ.యాభై వేలు, రామాంజనేయులు గుప్త నుంచి రూ.లక్ష, ప్రతాప్ ఇంజనీర్స్ నుండి మరో లక్ష తీసుకొని పారిపోయినట్లు చెప్పారని అంటున్నారు.

హత్య చేసిన రివాల్వర్‌ను భాను కిరణ్ సియోన్‌లోని ఓ ఇంట్లో దాచాడని పోలీసులు చెప్పారు. భాను దగ్గర దొరికింది మన్మోహన్ రివాల్వర్ అని పోలీసులు చెప్పారు. భాను అనేక నేరాలు చేశాడని చెప్పారు. నేర చరితుల్ని వెలికితీయాల్సి ఉందని చెప్పి పదిహేను రోజుల కస్టడీకి భాను కిరణ్‌ను పోలీసులు అడిగారు. పదిరోజుల కస్టడీ సరిపోదని చెప్పారు.

కాగా విచారణలో రాష్ట్రవ్యాప్తంగా భాను బినామీలు బయటపడుతున్నాయి. భాను కిరణ్ మీద వంద ఎకరాలు, మంగలి కృష్ణ పేరు మీద మరో వంద ఎకరాల భూమి ఉన్నట్లుగా సమాచారం. పలువురు సినీ ప్రముఖులకు భాను ఇళ్ల స్థలాలు ఇప్పించినట్లుగా తెలుస్తోంది. భాను, మంగళి కృష్ణ కలిసి స్థలం కొన్నారని, విజయవాడలో రెండువందల ఎకరాలను, ఎకరానికి రూ.25వేలు ఇచ్చి అతి చౌకగా భాను కొన్నట్లు తెలుస్తోంది.

కాగా అంతకుముందు భాను కిరణ్‌కు కడప జిల్లాకు చెందిన మంగళి కృష్ణ తుపాకి ఇచ్చాడని సిఐడి ఆరోపించింది. భాను కిరణ్‌ను 15 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ ప్రారంభమైంది. సిఐడి తరఫున వై. జయంతి వాదనలు వినిపిస్తున్నారు. మంగళి కృష్ణ ఇచ్చిన తుపాకిని భాను కిరణ్ మధ్యప్రదేశ్‌లోని సియోని పట్టణంలో దాచి పెట్టాడని సిఐడి వాదించింది.

ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో భాను కిరణ్ తిరిగాడని, ఆయా ప్రాంతాలను భాను కిరణ్‌ను తీసుకుని విచారించాల్సి ఉందని, ఆయా ప్రాంతాల్లో భానుకు సహకరించినవారి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉందని జయంతి కోర్టుకు చెప్పారు. భాను కిరణ్ ఆస్తులకు మంగళి కృష్ణ బినామీగా వ్యవహరించాడని సిఐడి ఆరోపించింది. బాను కిరణ్ రూ. 800 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సంపాదించినట్లు సిఐడి ఆరోపించింది.

హైదరాబాదు శివార్లలో భాను కిరణ్ పెద్ద యెత్తున భూముల సెంటిల్మెంట్లు చేశాడని సిఐడి ఆరోపించింది. సూరి జైలులో ఉన్నప్పుడు భాను కిరణ్ పలు సెటిల్మెంట్లు చేశాడని, కోట్లాది రూపాయలు సంపాదించాడని సిఐడి వాదించింది. భాను కిరణ్ పరారీలో ఉన్నప్పుడు కూడా మంగళి కృష్ణతో మాట్లాడాడని, ఈ సంబంధాలపై సమాచారం రాబట్టాల్సి ఉందని సిఐడి వాదించింది.

English summary
It is said that Bhanu Kiran, who is main accused in Maddelachervu Suri's murder case was accepted his threat calls to Shalimar Videos for Pawan Kalyan's Puli and Mahesh Babu's Khaleja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X