భానుకు సిఐడి కస్టడీ: విచారణకు కోర్టు షరతులు

భాను కిరణ్‌ను మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు పరచాలని కోర్టు సిఐడిని ఆదేశించింది. భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు శనివారం సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిరుడు జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరి హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. సూరిని తానే హత్య చేశానని భాను కిరణ్ అంగీకరించినట్లు సిఐడి అధికారులు చెప్పారు.
సినీ ప్రముఖులతో కూడా తనకు సంబంధాలున్నాయని, పెద్ద యెత్తున సెటిల్మెంట్లు చేశానని భాను కిరణ్ ఒప్పుకున్నాడని కూడా సిఐడి అధికారులు చెప్పారు. ప్రస్తుతం భాను కిరణ్ హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఉన్నాడు. భాను కిరణ్‌కు సహకరించినవారిపై, అతను తిరిగిన ప్రాంతాల గురించి ఆరా తీయాల్సి ఉందని సిఐడి చెప్పింది.
భాను కిరణ్ అరెస్టయిన తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి తనను తీవ్రంగా వేధించడం వల్లనే, చెల్లెనూ అమ్మనూ తిట్టడం వల్లనే తాను సూరిని హత్య చేసినట్లు భాను చెప్పాడు. భాను కిరణ్ అరెస్టుతో సూరి హత్య కేసులో అందరూ అరెస్టయినట్లేనని సిఐడి అంటోంది.












Click it and Unblock the Notifications