తెలంగాణ కోసం మేం, పదవి కోసం వైయస్ జగన్: విహెచ్

స్థానిక సమస్యలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ కోసం పోరాడి తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారని ఆయన అన్నారు. సమస్యలే కాదు, తెలంగాణ కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ స్థితిలో తమ పార్లమెంటు సభ్యులు ధర్నాలు చేశారని, రాజీనామాలు చేశారని, చివరికి లోకసభను స్తంభింపజేసి సస్పెండయ్యారని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షను పార్లమెంటు సభ్యులు వెల్లడించారని ఆయన అన్నారు.
తెలంగాణపై ఏదో ఒకటి చేయాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, సభ రోజువారీ కార్యక్రమాలు జరగాలి కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సాల్ చెప్పినట్లు పార్లమెంటు సభ్యులే చెప్పారని ఆయన న్యూఢిల్లీలో అన్నారు.
తెలంగాణకు చెందిన లోకసభ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాదులో అన్నారు. లోకసభ సభ్యులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని సస్పెండ్ చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమేనని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications