బాయ్ ఫ్రెండ్ పట్టించుకోలేదని విద్యార్థిని ఆత్మహత్య

మృతురాలిని కరీంనగర్ జిల్లా చింతగుడాకు చెందన కె. స్వాతి రాణిగా గుర్తించారు. లాంగ్వేజ్ సైన్సెస్ కోర్టు మూడో సంవత్సరం చదువుతోంది. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన రూమ్మేట్స్ చూడడంతో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటన వెలుగులోకి వచ్చింది. తలుపునకు గొళ్లెం పెట్టి లేకపోవడంతో రూమ్మేట్స్ తలుపు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి స్వాతి రాణి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.
వెంటనే స్వాతిని విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించింది. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం మెస్‌కు వెళ్లినప్పుడు మిత్రులు చివరి సారి ఆమెను చూశారు. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.
తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ తనను నిర్లక్ష్యం చేయడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె ఆ సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. స్వాతి చదువుతున్న తరగతిలోనే చదువుతున్న ప్రవీణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications