వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు నలుగురు మంత్రులు: సోనియాకు లేఖలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi-Jairam Ramesh-Ghulam Nabi Ramesh
న్యూఢిల్లీ: నలుగురు సీనియర్ మంత్రులు రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలని, తాము పార్టీ కోసం పనిచేస్తామని అంటూ నలుగురు కేంద్ర మంత్రులు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖలు రాశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి గులాం నబీ ఆజాద్, న్యాయం, మైనారిటీ వ్యవహారాల మంత్రి సల్మాన్ కుర్షీద్, ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ మంత్రి వాయలార్ రవి ఆ లేఖలు రాసినట్లు వార్తలు వచ్చాయి.

పార్టీలో భారీ మార్పుల కోసమే వారు రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణను వాయలార్ రవికి అప్పగించే అవకాశం ఉంది. పార్టీ కోసం పనిచేయడానికి 2008 లోకసభ ఎన్నికలకు ముందు కూడా జైరాం రమేష్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రణాళికను ఆయన రూపొందించారు. 2014 ఎన్నికల విషయంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ నలుగురు మంత్రి పదవులకు దూరమై పూర్తి కాలం పార్టీ కోసం పనిచేసే అవకాశాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో వైఫల్యంపై రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక నేపథ్యంలో పార్టీ పునరుద్దరణకు చర్యులు తీసుకోవాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంటోనీ కమిటీ నుంచి తుది నివేదిక ఏప్రిల్ చివరి నాటికి సోనియాకు అందుతుంది. తెలంగాణ పార్లమెంటు సభ్యులపై సోనియా గాంధీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకసభ కార్యకలాపాలను అడ్డుకోవడంపై ఆమె గుర్రుమంటున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కట్టడి చేయడానికి, తెలంగాణ సమస్యను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాయలార్ రవి, ఆజాద్, జైరాం రమేష్‌లకు ఆంధ్రప్రదేశ్‌తో మంచి సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక లోకసభ స్థానాలను సాధించాల్సిన అవసరం ఉందని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The major political party Congress is likely to bring back several ministers in the party. Four senior ministers wrote to Congress President Sonia Gandhi for the revival of their membership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X