భాను వెనుక ఎవరు?: సిఐడి కస్టడీకి భాను, రాష్ట్రాలకు..

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. భాను కిరణ్‌‍ను తమ కస్టడీకి పదిహేను రోజుల పాటు అప్పగించాలని సిఐడి కోర్టును ఆశ్రయించడంతో తొమ్మిది రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో సిఐడి భానును ఈ రోజు నుండి తొమ్మిది రోజులు విచారించనుంది.

చర్లపల్లి జైలులో ఉన్న భాను కిరణ్‌ను పోలీసులు బుధవారం ఉదయం తమ కస్టడీకి తీసుకున్నారు. అతనిని లక్టీకాపూల్‌లోని సిఐడి కార్యాలయం తరలించారు. అక్కడ భానును పోలీసులు మద్దెలచెర్వు సూరితో సంబంధం, హత్యకు తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా భాను వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అతనిని ప్రధానంగా వెనుక ఉన్న హస్తం ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారని అంటున్నారు. భానుతో పాటు సూరి హత్య కేసులో ఇంకా ఎందరు ఉన్నారు, వారెవరు, అతను మంగళి కృష్ణతో పాటు ఇంకా ఎవరితో కలిసి భూదందాలకు పాల్పడ్డాడనే కోణంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. విచారణలో భాగంగా భానును ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు విచారణ కోనసాగుతుంది. చర్లపల్లి జైలు నుంచి ప్రత్యే వాహనంలో భాను కిరణ్‌ను సిఐడి అధికారులు తీసుకు వచ్చారు. కస్టడీ సమయంలో భాను నుంచి పూర్తి వివరాలను రాబట్టేలా సిఐడి చర్యలు తీసుకుంటోంది. కాగా ఇప్పటికే రెండు బృందాలుగా సిఐడి ఏర్పడినట్లు సమాచారం.

కాగా భాను కిరణ్‌ను న్యాయవాది సమక్షంలో తొమ్మిది రోజుల పాటు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు. భాను కిరణ్ పైన మొత్తం పదిహేను కేసులు నమోదైనప్పటికీ కీలకమైన కేసు మాత్రం మద్దెలచెర్వు సూరి హత్య కేసే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+