విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'దమ్ము'కు సంబంధం లేదు: వంశీతో జగన్‌పై వంగవీటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vangaveeti Radhakrishna
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనూ, తనతోనూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఓ టీవి ఛానల్‌తో అన్నారు. వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం తనకు బాధ కలిగించిందన్నారు.

దివంగత తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్రను ఎవరు హత్య చేసింది, ఎవరు చేయించింది కోర్టులు తేలుస్తాయని ఆయన చెప్పారు. ఆయన హత్య ఎవరు చేయించారో చెప్పేందుకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరని ఆయన ప్రశ్నించారు. వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపిలో వంశీకి ఇబ్బందులు ఉంటే తమ పార్టీలోకి నిరభ్యంతరంగా రావొచ్చునని పిలుపునిచ్చారు. ట్రాఫిక్‌లో కలిసినప్పుడే తాను వంశీతో తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. తాను, వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రాణ స్నేహితులమని చెప్పారు. ఈ రోజు వల్లభనేని ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు తాను చూశానని, ఇద్దరం అభివాదం చేసుకున్నామని చెప్పారు. మా కలయిక కేవలం కాకతాళీయమేనని చెప్పారు.

కాగా రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రోడ్డుపై కలవడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. వంశీ జగన్ పార్టీలోకి వెళ్లనున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వంశీ మాత్రం వాటిని ఖండించారు. కాకతాళీయంగా కలిశామని చెప్పారు. అయితే దీనిపై సమాధానం చెప్పాలంటూ టిడిపి ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

English summary
YSR Congress Party Krishna district leader Vangaveeti Radha Krishna clarified on party chief and Kadapa MP YS Jaganmohan Reddy and Telugudesam Party leader Vallabhaneni Vamsi meeting. He said meeting is an Accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X