చిరంజీవిపై ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి చిన్నచూపు

ఆదివారం సాయత్రం కాంగ్రెస్‌పార్టీ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొనేందుకు బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చిరంజీవి వచ్చారు. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ తదితరులు పాల్గొన్న సమావే శంలో ఉప ఎన్నికల పోటీకి పార్టీ అభ్య ర్థుల ఎంపికపై చర్చ జరిగింది. సమావేశానంతరం ముఖ్యమంత్రి కిర ణ్‌కుమార్ రెడ్డితో పాటు అందరూ హైదరాబాదులోని పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించిన ఐదు నక్షత్రాల హోటల్ ప్రారం భోత్సవానికి బయలుదేరారు. అయితే ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో చిరంజీవికి చివరి వాహనంలో మా త్రమే స్థానం కల్పిచారు.
ముఖ్యమంత్రి వాహనంలో ముందు సీట్లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ కూర్చోగా, మధ్య సీట్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన పక్కనే గులాం నబీ ఆజాద్ కూర్చున్నారు. ముఖ్యమంత్రి చిరంజీవిని తన కారులో కూర్చోబెట్టుకుని పోవాలంటే ప్రోటోకాల్ సమస్యలు కూడా అడ్డుకావు. కారులోని రెండవ వరుస సీట్లో చిరంజీవితో పాటు ముగ్గురు కూర్చునేందుకు వచ్చిన పెద్ద ఇబ్బందేమీ ఉండదని అంటున్నారు. అయినా చిరంజీవిని తన కారులో ఆయన కూర్చోబెట్టుకోలేదు.
చిరంజీవిని వెనుక వాహనాల్లో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. తన దృష్టిలో చిరంజీవికి ఉన్న ప్రాధాన్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పకనే చెప్పారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిరంజీవిని ఉప ఎన్నికలకు బ్రహ్మాస్త్రంగా ఉపమోగించుకుంటామని ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ మరో సీనియర్ నేత వాయలార్ రవి ప్రకటించారు. చిరంజీవి జాతీయ స్ధాయి నేత అని, ఆయనకు చిన్నా చితక పనులు చెప్పరాదని, ఆయన స్ధాయికి తగ్గవే అప్పగించాల ని రాష్ట్ర నేతలకు ఆయన సూచించారు.
ఉప ఎన్నికల్లో తన వర్గానికి చెందినవారికి నాలుగు సీట్లు ఖరారు చేయించుకునేందుకు చిరంజీవి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి మాట ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనేది చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి మాత్రం చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఇష్టంగా లేరని మాత్రం అర్థమవుతూనే ఉన్నది.












Click it and Unblock the Notifications