రేణుకకు మద్దతు: కోదండరామ్, పొన్నంపై జగ్గారెడ్డి ఫైర్

రేణుకను విమర్శించినందుకు కోదండరామ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు. కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు డమ్మీ అని ఆరోపించారు. ఇప్పుడు కెసిఆర్ అంతకంటే పెద్ద డమ్మీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతోందన్నారు.
మీరు తెలంగాణవాది అన్న వారే తెలంగాణవాది అవుతారా అని కోదండరాంను ప్రశ్నించారు. రేణుకను విమర్శించే అర్హత, స్థాయి పొన్నం ప్రభాకర్‌కు లేదన్నారు. ఆయన అదృష్టవశాత్తూ ఎంపి అయ్యారన్నారు. ఎంపీలు దిగజారుడు మాటలు మానుకోవాలని సూచించారు. రేణుక తెలంగాణ బిడ్డ కాదన్న వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము చిత్తశుద్ధితో అధిష్టానంతో పోరాటం చేస్తున్నామని ఎంపి పొన్నం ప్రభాకర్ న్యూఢిల్లీలో అన్నారు. తాము ఏం చేయాలో కెసిఆర్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలతో వెళుతున్నారని ఆరోపించారు. అందరూ జెండాలు పక్కన పెట్టి ఢిల్లీలో తెలంగాణ కోసం పోరాటం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications