జగన్ క్షమాపణ చెప్పకపోతే మౌన దీక్ష చేస్తా: విహెచ్

తిరుమల తిరుపతి దేవస్థానంలో అనుచితంగా వ్యవహరించిన ఎందరో అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. వైయస్ జగన్ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుమలలో దేవాలయంలోకి ప్రవేశించే ముందు ఎంతటి వారైనా గంట కొట్టడం సంప్రదాయమని, కానీ జగన్ మాత్రం అలా చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. మహాద్వారం వద్ద జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
జగన్ తిరుమలలో పర్యటించిన రోజు చీకటి రోజు అన్నారు. డిక్లరేషన్ పైన సంతకం చేయనందుకు జగన్ వెంటనే శ్రీవారికి క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ పైన తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకున్నా, చర్యలు తీసుకోకున్నా తాను తిరుమలలో దీక్ష చేస్తానని చెప్పారు.
నిబంధనలకు విరుద్దంగా హంగామా సరికాదన్నారు. పవిత్రమైన స్థలాలకు వచ్చినప్పుడు ఎవరైనా దేవుడి పైన నమ్మకంతో రావాలని రాజకీయాల గురించి కాదన్నారు. దేవుడి ముందు కూడా జగన్‌కు అంత అహంకారామా అని ప్రశ్నించారు. నియమాల ఉల్లంఘన సరికాదన్నారు.












Click it and Unblock the Notifications