పాక్‌లోనే జవహరి, సయీద్‌పై చర్యల్లేవు: హిల్లరీ క్లింటన్

Hillary Clinton
కోల్‌కతా: పాకిస్తాన్ 26/11 ఘటనకు కారకుడైన హఫీజ్ సయీద్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ సోమవారం అన్నారు. భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం హిల్లరీ వచ్చారు. సోమవారం ఆమె కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడారు. సయీద్ పైన చర్యలు తీసుకునే దిశలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు.

సయీద్‌ను కోర్టులో నిలబెట్టాలని ఇటు భారత్, అటు అమెరికా రెండు దేశాలు అడుగుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై పాకిస్తాన్‌పై తాము ఒత్తిడి తీసుకు వస్తామని ఆమె చెప్పారు. సయీద్‌తో పాటు కారకులైన వారిని బోనులో నిలబెట్టే దిశలో పాకిస్తాన్‌ను కోరతామని చెప్పారు. ఆల్ ఖైదా నేత ఆల్ జవహరి కూడా పాకిస్తాన్‌లోనే ఎక్కడో ఉన్నాడని అమెరికా విశ్వషిస్తోందని చెప్పారు.

అంతకుముందు ఆమె ప్రపంచంలో అమెరికా-భారత్ దేశాల మధ్య సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆమె చెప్పారు. అయితే అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల అవరోధాలను అధిగమించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత హిల్లరీ ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐల రాకను అనుమతించాలని మమతని హిల్లరీ కోరారు.

అలాగే వారి మధ్య తీస్తా జల ఒప్పందం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌లో మమతతో హిల్లరీ భేటీ అయ్యారు. కాగా మమతా బెనర్జీ రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐ‌ల రాకను నిలువరించడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హిల్లరీ ఆమెను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+