'తెలంగాణ' లాయర్ల విధ్వంసం :సుప్రీంలో ప్రభుత్వం

తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని హెచ్చరించారని తెలిపారు. హైకోర్టు ఘటనలో ఓ లాయర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపింది. పదిహేను కేసులు నమోదు చేసినట్లు సుప్రీంకు ఇచ్చిన కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఘటన తర్వాత కోర్టులో భద్రత పెంచినట్లు తెలిపింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగిందని పేర్కొంది.
కాగా సకల జనుల సమ్మె సమయంలో హైకోర్టులో తెలంగాణ లాయర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కోర్టు కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు ధర్నాకు దిగారు. దీనిపై ఓ లాయరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం సమ్మె సమయంలో హైకోర్టులో జరిగిన ఘటనలపై పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసింది. లాయర్లు కోర్టులో ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. చట్టానికి చేతులోకి తీసుకుంటే ప్రభుత్వం వారిని అరెస్టు చేయకుండా ఎందుకు వదిలేసిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఘటనపై రైల్వే శాఖ కూడా మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications