పేరు చెప్పలేని జగన్ పార్టీ దద్దమ్మల పార్టీ: తులసి రెడ్డి

Tulasi Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన పూర్తి పేరు చెప్పుకోలేని దద్దమ్మ పార్టీ అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మట్లాడారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యానే కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు ప్రభుత్వం ప్రకటనలను రద్దు చేసిందని చెప్పారు.

ముఖ్యమంత్రిని రైతు వ్యతిరేకి అంటే జాతిపిత మహాత్మా గాంధీని అహింసా వ్యతిరేకి అనడమే అన్నారు. జగన్‌కు చెందిన సాక్షికి ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు తన స్వంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానెల్‌కు ప్రకటనల నిలిపివేత విషయమై జగన్ అనవసర రాద్ధాంతం చేయటం తగదన్నారు. ప్రభుత్వ ప్రకటనల కోసమే జగన్ ఛానల్, పత్రికలను స్థాపించారా అని ప్రశ్నించారు. ఇతర పత్రికలు, ఛానెళ్లు, పార్టీలపై జగన్‌కు ఎందుకు అంత చులకన భావమని అడిగారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

వైయస్ జగన్ తన వర్గం నేతలతో తాను ముఖ్యమంత్రి కావడానికే రాజీనామా చేయించారని ఆరోపించారు. ఆయనకు పదవి పైన మోజు పుట్టిందన్నారు. పదవి పైన ఆశ ఉండటం తప్పు కాదని, అయితే దానికి సమయం, సందర్భం ఉంటుందని, అప్పటి వరకు ఆగాల్సి ఉంటుందన్నారు. కానీ జగన్ మాత్రం సమయం కోసం చూడకుండా అప్పటికప్పుడే పీఠం ఎక్కాలని ఉవ్వీళ్లూరుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+