ఒకే వేదికపై నవీన్, జయలలిత: కూటమి పుకార్లు

రెండు రోజుల పర్యటన నిమిత్తం నవీన్ పట్నాయక్ గురువారం చెన్నై వచ్చారు. ఉగ్రవాద నిరోధక జాతీయ కేంద్రం (ఎన్‌సిటిసి) ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటయ్యే ముఖ్యమంత్రుల సబ్ కమిటీకి జయలలిత నేతృత్వం వహిస్తారని నవీన్ పట్నాయక్ గురువారం చెప్పారు.
ప్రస్తుత రూపంలో ఎన్‌సిటిసి ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో జయలలిత, నవీన్ పట్నాయక్ ఉన్నారు. జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాల మార్పుపై నవీన్ పట్నాయక్ పర్యటన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తమ వ్యహాన్ని రూపొందించుకోవడానికి తమ పార్టీ పార్లమెంటు సభ్యుల నుంచి, శానససభ్యుల నుంచి అభిప్రాయాలు కోరినట్లు నవీన్ పట్నాయక్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎన్‌సిటిసిని నరేంద్ర మోడీతో పాటు జయలలిత, నవీన్ పట్నాయక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు, బిజెపియేతర పార్టీలు అనుసరించాల్సిన వైఖరిపై కూడా వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications