భానుపై మరో కేసు, గురుకుల ట్రస్టు భూవివాదం

గురుకుల ట్రస్టు భూవివాదానికి సంబంధించి హైదరాబాదులోని పంజగుట్టులో గల ఓ హోటల్లో భాను కిరణ్, ఇతరులు ఒప్పందం రాసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో భాను కిరణ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటి వారంట్ పిటిషన్ దాఖలు చేశారు. భాను కిరణ్‌ను పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. భూమిని అమ్ముతానని చెప్పి ముగ్గురిని భాను కిరణ్ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు స్టేషన్ గురుకుల ట్రస్టుకు సంబంధించి కేసు నమోదైంది.
మద్దెల చెరుల సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ అలియాస్ భానుని తమ కస్టడీకి అప్పగించాలని మంగళవారం సైబరాబాద్ పోలీసులు మియాపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను కోర్టు మే 28కి వాయిదా వేసింది. సైబరాబాద్ పరిధిలో భాను చేసిన సెటిల్‌మెంట్లు, భూ ఆక్రమణలపై విచారించేందుకు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోపక్క కూకట్‌పల్లిలో జ్యోత్స్న అనే మహిళను బెదిరించిన కేసులో మంగళవారం విచారణ జరిగింది.
భాను కిరణ్‌కు ఈ నెల 28వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భాను కిరణ్‌పై భూవివాదాల సెటిల్మెంట్లకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. ఈ వివాదాల్లో భాను కిరణ్‌ను విచారించేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసులు విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications