వాయలార్‌తో చిరంజీవి:కూతురింట్లో ఐటి దాడులపై చర్చ!

కాగా బుధవారం వాయలార్ రవి రాష్ట్రానికి రానున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు పార్టీ నేతలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. ఆయన మూడు రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితలతో కలిసి ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
రవి ప్రచార షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 17న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో, 18న అనంతపురంలో, 19న గుంటూరులో వాయలార్ రవి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. ప్రచార సమయంలోనే ఆయన ఆయా నియోజకవర్గ నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఉప ఎన్నికలలో గెలుపు వ్యూహాలపై వారితో చర్చించనున్నారు.
ఉప ఎన్నికల ప్రచారానికి వాయలార్ రవిని తాము ఆహ్వానించినట్లు బొత్స సత్యనారాయణ హైదరాబాదులో చెప్పారు. కాగా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన వాయలార్ రవి రాష్ట్ర నేతల నుండి అభిప్రాయాలు సేకరించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications