సిఎంపై శంకరరావు రుసరుస, ఆయన తండ్రికి కితాబు

చచ్చినా తన శైలిని మార్చుకోననే తరహా కిరణ్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సిఎం అహంభావంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనలో అడుగడుగునా కుల అహంభావం కనిపిస్తోందన్నారు. పార్టీ భూస్థాపితం అయినా మారిపోననే విధంగా కిరణ్ వైఖరి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి జైలులో ఉన్నప్పుడు తన తండ్రి విడిపించారని కిరణ్ చెప్పడం సరికాదన్నారు.
నేరస్తుడిని జైలు నుండి విడిపించారన్నందుకు కిరణ్ వ్యాఖ్యలపై ఎవరైనా పిల్ వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి ఐక్యతతో పార్టీని నడిపిస్తే ఉప ఎన్నికలలో పద్దెనిమిది సీట్లు కాంగ్రెసు పార్టీవే అన్నారు.
తనను పార్టీ పెద్దలు ప్రచారానికి పిలవడం లేదని ఆయన మండిపడ్డారు. తన వల్ల మరో నాలుగు ఓట్లు రావడం ఎవరికీ ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి రిఫరెండమే అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు నేతలు జోరుమీద ఉన్నారన్నారు. తన స్టైల్ మారదని ఇంతే అన్నారు.












Click it and Unblock the Notifications