హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశ్వసనీయత అంటే దోచుకోవడమా: జగన్‌కు దాడి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dadi Veerbhadra Rao
హైదరాబాద్/విజయవాడ: విశ్వసనీయత అంటే దోచుకోవడమా అని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు జైలుకు వెళుతున్నారని ఆయన అన్నారు.

జగన్‌కు లబ్ధి చేకూరేలా జారీ చేసిన జివోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులు తప్పించుకొని అధికారులను మాత్రం బలి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ, ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. వైయస్ హయాంలో అవినీతికి కేబినెట్‌దే బాధ్యత అన్నారు. ఇప్పుడు మాత్రం మంత్రులు ఎవరూ నోరు మెదపడం లేదన్నారు.

అవినీతి సొమ్ము ముట్టింది కాబట్టే మంత్రులు ఇప్పుడు నోరుమెదపడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కిరణ్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ఎర్రచందనం ఆరోపణలపై సిఎం సమాధానమివ్వాలన్నారు. సిఎం గాలిలో ఎగురుతూ సమస్యలను గాలికి వదిలేశారన్నారు.

కాగా మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు కృష్ణా జిల్లా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల వివరాలను వెంటనే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో మృతదేహం బయటపడినందున సంప్రోక్షణ చేయాల్సిందేనని ఆయన చెప్పారు. ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam Party senior leader Dadi Veerbhadra Rao questioned YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on wednesday about ethics and reliability. Devineni Umamaheswara Rao demanded to reveal investors name who were invest in Jagan firms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X