జగన్‌ను ప్రోత్సహించాలని సోనియా...: వాయలార్

Vayalar Ravi
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావించారని, అయితే ఈలోగానే జగన్ తన దారి చూసుకున్నారని కేంద్ర మంత్రి, కాంగ్రెసు కేంద్ర పరిశీలకుడు వాయలార్ రవి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్‌ను విమర్శిస్తూ అనవసరంగా జగన్‌ను పెద్దోడ్ని చేయొద్దని ఆయన కాంగ్రెసు నాయకులకు సూచించారు. ఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభా నియోజకవర్గాల పరిశీలకులతో వయలార్ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి పార్టీని వీడిన జగన్‌ను గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులపై ఆధారపడి లేదని, ఇది ఒక వ్యవస్థాగతమైన పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పరిశీలకులు వారు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తూ, అభ్యర్థి విజయానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ చెప్పారు. నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మండలాల వారీగా గ్రామాల ప్రాతిపదికన 10 నుంచి 15 బూత్ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ముఖ్యనాయకుల పర్యటనల షెడ్యూల్‌ను తయారు చేసి వాటిని పర్యవేక్షించాలని కోరారు. నియోజకవర్గాల్లో సామాజిక ప్రాబల్యాలను గుర్తించి, వాటిని ప్రభావితం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

నెల్లూరు లోక్‌సభకు మాదాసు గంగాధర్, నరసన్న పేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు త్రిపురాన వెంకటరత్నం, ఎస్.గోపాల్, పాయకరావుపేటకు ఎం.రజనీరెడ్డి, మజ్జి శారద, రామచంద్రాపురానికి బి.మహేశ్‌కుమార్ గౌడ్, పి.లక్ష్మణరావు గౌడ్, నర్సాపురానికి కొట్టు సత్యనారాయణ, బస్వరాజు శ్రీనివాస్, పోలవరానికి జె.గౌతమ్, పైల సోమినాయుడు, ప్రత్తిపాడుకు ఆర్‌డి విల్సన్, సిహెచ్ బాలరాజ్, మాచెర్లకు ఎం.సూర్యానాయక్, సామ గణేశ్ రెడ్డి, ఒంగోలుకు హరిరమాదేవి, నేరెళ్ల శారద, తిరుపతికి చంద్రశేఖరరెడ్డి పరిశీలకులుగా నియమించారు.

హెచ్.వేణుగోపాలరావు, రాజంపేటకు తలారి మనోహర్, పత్తి వెంగమ్మ, రాయచోటికి ఎస్.ఎ.రహమాన్, దాసరి రాము, షేక్ నజీర్ అహ్మద్, ఉదయగిరికి మల్ల రమేష్, ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, అనంతపురానికి ఫిరోజ్ బేగం, దిలీప్ చక్రవర్తి, రాయదుర్గానికి ఎస్.లక్ష్మీనారాయణ, ఎ.మల్లేశ్, పరకాలకు ఎస్.జగదీశ్వరరెడ్డి, ఎస్. జగన్మోహనరావు, తిలకం నిరంజన్‌రాజ్, ఆళ్లగడ్డకు బూరగడ్డ వేద వ్యాస్, సోమశేఖర్, ఎమ్మిగనూరుకు రాపోలు జయప్రకాశ్, రాం భద్రయ్య, కోడూరుకు ఎం. తిప్పేస్వామి, నీలు శ్రీనివాసులను నియమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+