జగన్ సాక్షి మీడియాకు వైయస్ వివేకానంద బాసట

సాక్షి మీడియాను నిర్వీర్యం చేయాలని అనుకోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయడాన్ని తాను సహించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు సరైనవా, కాదా అనేది జూన్ 15 తర్వాత ప్రజలే తేలుస్తారని ఆయన అన్నారు. జూన్ 15వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే.
సాక్షిని మూసేయించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు విమర్శించారు. దానికి ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయని ఆయన తిరుపతిలో అన్నారు. వివాదాస్పద జీవోలపై సంతకాలు చేసిన మంతరులు తమ పదపులకు రాజీనామా చేయాలని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ధర్మయుద్ధంలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, సాక్షిలదే విజయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఓ బఫూన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి వంటి నాయకులు కొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు.
సాక్షి మీడియా అంటేనే కాంగ్రెసు ప్రభుత్వానికి వణుకు పుడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. ఆ భయంతోనే అర్థ రాత్రి జీవోలు జారీ చేస్తోందని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్‌పై కక్ష సాధింపుతో సాక్షిని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరోటి కాదని ఆమె అన్నారు.
వివాదాస్పద జీవోలకు సంబంధించి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సాక్షి మీడియా ఆస్తుల జప్తు జీవోపై సంతకం చేయడం సిగ్గు చేటు అని ఆమె వ్యాఖ్యానించారు. సాక్షిని చూసి కాంగ్రెసు ఎంతగా భయపడుతోందో ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications