నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీరియల్ హత్యల వెనక వైయస్ జగన్: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నెల్లూరు: రాష్ట్రంలో జరిగిన సీరియల్ హత్యల వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఆయన శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. జగన్ పట్ల తనకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, వైయస్ జగన్ వ్యవహారాల వల్ల రాష్ట్రం భ్రష్టు పడుతోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గజదొంగల్లా తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

కోడి పందేలు, గుర్రప్పందాలను చూశామని, కానీ రాజకీయాల్లో బెట్టింగులను ప్రవేశపెట్టిన ఘనత వైయస్ జగన్‌దేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో బెట్టింగుకు జగన్ ఆద్యుడని ఆయన అన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో బెట్టింగులు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. కోవూరులో నైతికంగా తమ పార్టీయే గెలిచిందందని, కడపలో మాదిరిగా వైయస్సార్ కాంగ్రెసుకు మెజారిటీ రాలేదని, భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత దిగజారుతుందని ఆయన అన్నారు.

తమ పార్టీ కార్యర్తలను విస్మరించబోదని, ప్రస్తుతం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఆయన అన్నారు. తమ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నాయని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, కానీ తమ పార్టీ ఇబ్బందుల్లో లేదని, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన తమ పార్టీ తప్ప ఏ పార్టీ నిలబడలేదని ఆయన అన్నారు. టిడిపికి ముందు జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెసు వచ్చినా నిలబడలేదని, చెన్నారెడ్డి ఎన్జీ రంగాలు కూడా పార్టీలు పెట్టారని, కానీ నిలబడలేదని ఆయన అన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే 30 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తోందని, విశ్వసనీయత వల్లనే పార్టీ మనుగడ సాగిస్తోందని ఆయన అన్నారు.

ఓ సినీ యాక్టర్ పార్టీ పెట్టి ఎన్టీఆర్‌తో పోల్చుకున్నారని, సామాజిక న్యాయం చేస్తామని చెప్పారని, కానీ తన న్యాయం చూసుకుని కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించిందని, దేశ రాజకీయాలను కూడా శాసించిందని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు మద్యం సిండికేట్లలో ఉన్నారని ఆయన ఆరోపించారు. పేదల రక్తాన్ని వారు జలగల్లా తాగుతున్నారని ఆయన అన్నారు.

రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును విచారించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై తాము రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

English summary
Attacking YSR Congress president YS Jagan, Telugudesam president N Chandrabababu Naidu accused that YS Jagan hand is there in serial murders. He demanded question KVP Ramachandar Rao in land scams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X