ప్రశ్నలపై ఆగ్రహం, షో నుంచి మమతా బెనర్జీ వాకౌట్

ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర అరెస్టుపై జాదవపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థి వేసిన ప్రశ్నకు మమతా బెనర్జీ ఆగ్రహం చెందారు. అది కార్టూన్ కాదని, కార్టూన్లను తానూ ఇష్టపడుతానని, అతను సిపిఎం వ్యక్తి అని, తన ఇ- మెయిల్‌ను దుర్వినియోగం చేసి వారి అంగీకారం లేకుండా ఆ కార్టూన్‌ను పంపాడని, 60 మందికి అతను దాన్ని పంపించాడని ఆమె రుసరుసలాడారు.
ప్రొఫెసర్ మేధావి కాడని, సిపిఎం ఏజెంట్ అని ఆమె వ్యాఖ్యానించారు. సిపిఎం, మావోయిస్టులు కలిసి పనిచేస్తున్నారని ఆమె విమర్శించారు. సిపిఎఁ వేలాది సిడీలు పంపిందని, మీరు మహిళవైతే వాటిని చూస్తే సిగ్గుపడతావని ఆమె మోడరేటర్‌ను ఉద్దేశించి అన్నారు. కార్టూన్‌లో ఉన్న వానిష్ అనే పదం హత్యకు సంబంధించిన కుట్రను సూచిస్తోందని ఆమె అన్నారు. ప్రొఫెసర్ సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
అది కార్టూన్ కాదని, తనను హత్య చేయడానికి పన్నిన రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపించారు. తనకు ఇష్టం లేని ప్రశ్నలు వస్తుండడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. మావోయిస్టు సానుభూతిపరులు, సిపిఎం వారు కలిసి ప్రశ్నలు వేస్తున్నారనే విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు. తీవ్ర అసహనానికి గురైన మమతా బెనర్జీ సిఎన్ఎన్ - ఐబియన్ షో నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications