ఐఐటి సాధించిన ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రూ. 50 వేలు

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా పది వేల రూపాయలు ఇచ్చేది. ఈసారి దాన్ని పెంచారు. నిరుడు ఇదే కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఐఐటి - జెఇఇలో ఆర్హత సాధించగా ఈ ఏడాది 18 మంది విద్యార్థినీ విద్యార్థలు అర్హత సాధించారు. మొత్తం 52 మంది విద్యార్థుల్లో 18 మంది ఐఐటికి అర్హత సాధించగా మిగిలినవారు ఎఐఇఇఇలో మంచి ఫలితాలు సాధిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.
ఐఐటి - జెఇఇలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు వారి కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లిస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఐఐటి - జెఇఇలో అర్హత సాధించిన కళాశాలకు చెందిన 18 విద్యార్థినీ విద్యార్థులు్లో 17 మంది ఎస్సీలు కాగా, ఒకరు ఎస్టీ. వీరి తల్లిదండ్రులు కూలీలు, రైతులు, హమాలీలు, ఐకెపి వర్కర్, టైలర్, ఆటో డ్రైవర్ వంటి వృత్తులు చేస్తున్నారు. ఈ 18 మంది కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications