కిరణ్ రెడ్డిపై కెకె ఫైర్: సమైక్యవాది ప్రకటనగా వ్యాఖ్య

K Keshav Rao
హైదరాబాద్: ప్రాంతీయవాదం ఎక్కువ కాలం నిలువదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకుడు కె. కేశవరావు మండిపడ్డారు. తమది ప్రాంతీయవాదం కాదని, ప్రత్యేక రాష్ట్రవాదమని ఆయన అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి సభకు హాజరైన ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్యవాదిగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేశారని ఆయన తప్పు పట్టారు.

ప్రత్యేక రాష్ట్రం తమ హక్కు అని, తెలంగాణ అభివృద్ధి తమ జన్మహక్కు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. తాము ఈ నెల 24, 25 తేదీల్లో సమావేశమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలమైన ప్రకటన వస్తుందని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

మూడు, నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం కాకపోతే తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన చెప్పారు. తాము ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావన ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా వ్యక్తమైందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తాము పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు.

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లా జనగామ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అభినందించాల్సిందే అన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ తెలంగాణ సాధిస్తామని కోమటిరెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+