జగన్ ఒక్కడు ఒక వైపు, ఎదుర్కోలేక కుట్ర: సబ్బం

విశాఖపట్నం జిల్లా గాజువాకలో సోమవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే జనగ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. మొదటి నుంచీ సబ్బం హరి వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పాయకరావుపేట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు అన్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు సంభవిస్తాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జగన్‌తోనే సాధ్యమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చడంతో ఆగ్రహంగా ఉన్న అనంతపురం జిల్లా ప్రజలు తమ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గుర్నాథ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో పనిచేస్తున్న జగన్ వెంటే ప్రజలు ఉన్నారని ఆయన సోమవారం అనంతపురం జిల్లాలో అన్నారు. పదవులను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని, వారు తమ పార్టీలోకి వస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications