జగన్ ఎఫెక్ట్ ఉంది, అధిగమిస్తాం: వాయలార్ రవి

వైయస్ జగన్‌పై జరుగుతున్న సిబిఐ దర్యాప్తుతో తమ పార్టీకి గానీ ప్రభుత్వానికి గానీ సంబంధం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు నుంచి భారీ వలసలు ఉండవని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై రెఫరెండం కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ కాంగ్రెసు పార్టీ పరిస్థితి మెరుగైందని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ అంశాన్ని ఢిల్లీ చూసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే మూడు నెలల్లో రాజీనామా చేస్తారని తెలంగాణ ఎంపిలు అన్నారని, అది తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో జగన్ అంశం కూడా కీలకమేనని ఆయన అన్నారు. జగన్ వ్యవహారం పూర్తిగా సిబిఐ పరిధిలోదే అని, కాంగ్రెసుకు సంబంధం లేదని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ప్రచారానికి మంచి మద్దతు లభిస్తోందని, మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో తాను మాట్లాడుతానని, పార్టీ అధిష్టానం కూడా తగిన సమయంలో చర్చిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజకీయ పార్టీ నేత అని, కెసిఆర్ ఏమైనా మాట్లాడుతారని ఆయన అన్నారు.
రాజీవ్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ రావు, మంత్రులు గీతారెడ్డి, దానం నాగేందర్, తదితరులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications