సస్పెన్స్‌కు తెర: కోర్టుకు వైయస్ జగన్ రావాల్సిందే

YS Jagan
హైదరాబాద్: ఆస్తుల కేసులో ఈ నెల 28వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హాజరవుతారా, లేదా అనే సంశయానికి సిబిఐ కోర్టు సోమవారం తెర దించింది. ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ స్వయంగా హాజరు కావాలని కోర్టు తేల్చి చెప్పింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ సాయి రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది - ఈ నెల 28వ తేదీన జగన్ తప్పకుండా హాజరు కావాలా, న్యాయవాది హాజరైతే సరిపోతుందా అని అడిగారు.

జగన్ తరఫు న్యాయవాది వేసిన ప్రశ్నకు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన నిందితుడి ఫస్ట్ అప్పియరెన్స్ అవసరమని, అందువల్ల వైయస్ జగన్ హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు మొదటి చార్జిషీట్‌పై దర్యాప్తును, ట్రయల్‌ను ఆపేయాలని కోరుతూ విజయసాయి రెడ్డి వేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

మొదటి చార్జిషీట్‌లో రెండో నిందితుడు విజయసాయి రెడ్డికి మినహా మిగతా 12 మందికి కోర్టు సమన్లు జారీ చేసింది. వైయస్ జగన్ కూడా సమన్లు అందుకున్నారు. వీరంతా ఈ నెల 28వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. తాను కోర్టుకు హాజరవుతానని వైయస్ జగన్ ఇది వరకే చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది.

ఇదిలా వుంటే, వైయస్ జగన్ మీడియా సంస్థల ఆస్తుల జప్తునకు సిబిఐ సోమవారం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జగన్‌కు చెందిన జననీ ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్ (సాక్షి పత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టెలివిజన్) సంస్థల ఆస్తుల జప్తునకు సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటికే జగన్ మీడియా సంస్థలు కెవియట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు నిందితులు కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి ఆస్తుల జప్తునకు కూడా సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+