గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగ దెబ్బ తీసేందుకు, దేవుడు ఆశీర్వదిస్తాడు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: తన ఒక్కడని రాజకీయంగా ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీ పెద్దలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 అంతా ఒక్కటై తనను దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాక్షి పత్రికను, సాక్షి టివిని మూసేయించాలని అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారన్నారు.

సాక్షి లేకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9 చెప్పిందే వేదమన్నారు. ఇతరులు ఏం రాసినా జనానికి కనబడదు, వినపడదన్నారు. ఈ రాష్ట్రంలో టిడిపి, కాంగ్రెసు పార్టీలో తప్ప మరొకటి ఉండకూడదన్నదే వారి కుతంత్రమన్నారు. వారు చేస్తున్న చీకటి రాజకీయాలను అందరూ చూస్తున్నారని అన్నారు. పై నుండి దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడని, ఎన్నికలు త్వరలో వస్తాయని, దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించి ప్రతి గుండె ఒక్కటై ఉప్పెన వస్తుందన్నారు. ఆ ఉప్పెన నుంచి ఒక తుఫాను వస్తుంది. ఆ తుఫానులో కాంగ్రెసు, టిడిపి కొట్టుకుపోతాయన్నారు. రైతులు, పేదల కోసం రాజీనామా చేసిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. విద్యార్థులకు సర్కారు ఫీజులు సక్రమంగా చెల్లించడం లేదని, వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను సక్రమంగా అలు చేయడం లేదని మండిపడ్డారు.

విద్యార్థుల బతుకులతో చెలగాటమాడవద్దని ధర్నాలు చేశామని, దీక్షలు చేశామని, అయినా ప్రభుత్వం ఆ విద్యార్థుల గురించి కనీసం ఆలోచించడం లేదన్నారు. వైయస్ మరణానంతరం రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ప్రతి పక్షం కూడా ప్రజల తరఫున పోరాడటం మాని అధికార పక్షంతో కుమ్మక్కైందన్నారు.

English summary
YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy blamed Telugudesam, Congress, Eenadu, Andhrajyothy and TV9. He said, Sakshi media properties bank accounts freeze is conspiracy of TDP chief Nara Chandrababu Naidu and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X