హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28నే కాదు, ముందే రండి!: జగన్‌కు సిబిఐ, అరెస్టేనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మరోసారి నోటీసులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కేసులో వాస్తవానికి ఈ నెల 28వ తేదిన సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ హాజరు కావాలని జగన్‌కు సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌కు మరోసారి నోటీసులు అందజేసేందుకు సిబిఐ బృందం ఒకటి బయలుదేరినట్లుగా తెలుస్తోంది.

తదుపరి దర్యాఫ్తులో భాగంగా... అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తమ ముందు హాజరు కావాలని సిబిఐ నోటీసులో కోరినట్లుగా తెలుస్తోంది. తాజా నోటీసులపై అధికారులెవ్వరూ స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నెల 25న తమ ముందు హాజరు కావాల్సిందిగా పిలుపు వచ్చిందని తెలుస్తోంది. ఆ సమన్లను అందించేందుకు గుంటూరు జిల్లా మాచర్లలో ఉన్న జగన్ వద్దకు మంగళవారం రాత్రి సిబిఐ అధికారులు బయలుదేరారని అంటున్నారు.

సిబిఐ అధికారుల బృందం ఒక ప్రత్యేక వాహనంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మాచర్ల బయలుదేరినట్లుగా తెలుస్తోంది. సమన్లను జగన్‌కు అందించేందుకే వారు వెళ్లారని అంటున్నారు. అయితే ఈ సమన్లను సిబిఐ కోర్టు జారీ చేసిందా? లేక అక్రమాస్తుల ఆరోపణల్లో ప్రశ్నించేందుకు సిబిఐ తనంతట తానుగా నోటీసు ఇవ్వబోతోందా? అన్నది స్పష్టంగా తెలియరావడం లేదు. 28వ తేదీన జగన్ స్వయంగా హాజరుకావాలని సిబిఐ కోర్టు ఇప్పటికే సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఒకసారి జారీ చేసిన సమన్లను, తేదీని సవరించుకోవడానికిగానీ, వెనక్కి తీసుకోవడానికి గానీ అదే కోర్టుకు అధికారం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కావాలంటే మరో చార్జిషీటు ఆధారంగా కొత్త సమన్లు జారీ చేయడానికి అవకాశం ఉందంటున్నారు. అయితే జగన్ కేసులో మొదటి చార్జిషీటు ఆధారంగా తొలి సమన్లు జారీ అయ్యాయి. రెండో చార్జిషీటును మొదటి దానికి అనుబంధంగా మార్చారు. అందువల్ల రెండో చార్జిషీటులో ప్రత్యేకంగా సమన్లు జారీ అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

ఇక మూడో చార్జిషీటును సిబిఐ కోర్టు తిరస్కరించి వెనక్కి పంపింది. అందువల్ల తాజా సమన్లను కోర్టు జారీ చేసి ఉండక పోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐనే ప్రశ్నించడానికి జగన్‌ను పిలిపిస్తుండవచ్చని తెలుస్తోంది. జగన్‌పై నాలుగో చార్జిషీటు వేయడానికి సన్నద్ధమవుతున్న సిబిఐ భారతీ సిమెంట్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఈ వ్యవహారంపై ప్రశ్నించడానికి సిబిఐ సమన్లు జారీ చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అయితే సిబిఐ జగన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. స్వయంగా జగన్ కూడా తనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, వి.హనుమంత రావు, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్ అరెస్టు ఖాయమని చెబుతున్నారు. జగన్ నోటి నుండి కూడా స్వయంగా అరెస్టు వ్యాఖ్యలు రావడంతో అరెస్టుపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

English summary
It is said that, Central Bureau of Investigation(CBI) is ready to issue notices to YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy again. It seems, a group of CBI went to Guntur district to gave notices to YS Jagan to attend before CBI on 25th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X