మోపిదేవి రూ.8 కోట్లు లంచం తీసుకున్నారు: సిబిఐ

అనంతరం సిబిఐ మోపిదేవి అరెస్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సిబిఐ పలు అంశాలను వెల్లడించింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖా మంత్రిగా పని చేసిన మోపిదేవి వాన్‌పిక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్టానుసారం జివోలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలినట్లు పేర్కొంది.
ఇందుకోసం మంత్రి రూ.8 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలిందన్నారు. దీనితో అవినీతితో పాటు ఖజానాకు నష్టం కలిగించిన ఆరోపణలతో విచారణ నిమిత్తం దిల్ కుషా అతిథి గృహానికి వచ్చిన మోపిదేవిని అరెస్టు చేశామని తెలిపింది. మంత్రిపై 120 (బి), రెడ్‌విత్ 420, 477 (ఎ), 409 పాటు 13 (1) డి, 13(2)ఆర్‌డబ్యు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోపిదేవి అరెస్టు వివరాలను సిబిఐ అధికారులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మోపిదేవి జారీ చేసినట్లుగా చెబుతున్న వివాదాస్పద జివోలు.. జివో నెంబర్ 29.. వాన్‌పిక్‌కు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుండి మినహాయింపులు, జివో నెంబర్ 30 వాన్‌పిక్‌కు రాయితీల ఒప్పందానికి ఆమోదం, జివో నెంబర్ 31 వాన్‌పిక్‌కు భూసేకరణ ముసాయిదా. సమగ్ర ఆధారాలు సేకరించినట్లుగా సిబిఐ తెలిపింది. మరోవైపు మోపిదేవి వెంకట రమణను జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా చేర్చుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.
కాగా మంత్రి మోపిదేవి అరెస్టుకి జగన్ అక్రమాస్తుల కేసు మూలం కావడం మరో కీలక పరిమామం. రాష్ట్ర చరిత్రలో అవినీతి ఆరోపణలతో మంత్రి ఒకరు అరెస్టు కావడం ఇదే తొలిసారి. అందునా అవినీతి ఆరోపణలతో, ముడుపులు అందుకొని ఖజానాకు నష్టం కలిగించిన ఆరోపణలతో స్వయంగా సిబిఐ అదుపులోకి తీసుకోవడం విశేషం. కాగా మోపిదేవి అరెస్టుతో హైదరాబాదులో 144న సెక్షన్ విధించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications