వైయస్ జగన్‌పై విజయమ్మకు లగడపాటి సలహా

Lagadapati Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట తమ పార్టీ శాసనసభ్యులు ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ కుట్రలో మీడియావాళ్లు భాగస్వాములు కావద్దని ఆయన సూచించారు.

చార్జిషీట్, అభియోగాలు బలంగా ఉన్నప్పుడు తమ పార్టీ నాయకత్వం ఎవరిని వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. ఇందుకు నిదర్శనంగా ఆయన సురేష్ కల్మాడీ వ్యవహారాన్ని ఉదహరించారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడితే కాంగ్రెసు పార్టీ ఎవరినీ వదలిపెట్టదని ఆయన అన్నారు. ప్రజాహిత పాదయాత్ర కొనసాగుతోందని, కొన్ని కారణాల వల్ల తాను ఆగిపోయాయని, మళ్లీ పోలవరంలో పాదయాత్రలో కలుస్తానని ఆయన చెప్పారు.

రూ. 800 కోట్లకు సంబంధించిన వ్యవహారాన్ని వైయస్ జగన్ స్వయంగా అంగీకరించాడని, సంతకాలకు ఒత్తిడి చేశారని మంత్రే చెప్పాడని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు వల్ల ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందో తెలుసుకుంటామని, వైయస్ జగన్ గురించి ప్రజలకు నచ్చజెప్పుతామని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తుతో తమ పార్టీకి గానీ ప్రభుత్వానికి గానీ ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తోందని ఆయనఅన్నారు. అన్ని డీల్స్‌లోనూ వైయస్ జగన్ లబ్ధిదారుడని ఆయన ఆరోపించారు. చేసిన తప్పును వైయస్ జగన్ ఒప్పుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణపై ఈ నెల 28వ తేదీ తర్వాత మాట్లాడుతానని ాయన చెప్పారు. జగన్ ఒక్కడే నీ కుమారుడు కాడు, విపరీతమైన మనస్తత్వం వల్ల జగన్ వైయస్‌పై ఒత్తిడి తెచ్చాడని, సిఎంఓ కూడా వైయస్ జగన్ ఒత్తిడికి తల వంచి ఉండవచ్చునని ఆయన అన్నారు. తన తమ్ముడు శ్రీధర్ రాజారెడ్డి హయాం నుంచే వైయస్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాడని ఆయన అన్నారు. జగన్ వల్ల చాలా మంది జైలు పాలయ్యారని ఆయన అన్నారు. జగన్‌పై సానుభూతి ఉందో లేదో కొద్ది రోజుల్లో తేలుతుందని ఆయన అన్నారు. జగన్‌ను దారిలో పెట్టండి, తప్పు ఒప్పుకోమనండి అని ఆయన వైయస్ విజయమ్మకు సలహా ఇచ్చారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో పనిచేసేన సూరీడును సీబీఐ విచారించినప్పుడు వైఎస్ ఆత్మ అని చెప్పుకునే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావును ఎందుకు విచారించరని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కెవిపిని సీబీఐ విచారించాలని ఆయన శుక్రవారం గుంటూరులో డిమాండ్ చేశారు. దీనిపై సిబిఐ జేడీ లక్ష్మీనారయణకు లేఖ రాస్తానని విహెచ్ తెలిపారు. వైయస్ మీద భక్తి, భయంతోనే మోపిదేవి సంతకం చేశారని, మోపిదేవి నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. చిన్న చేపలనే కాకుండా తిమింగలాలను కూడా అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+