జగన్ ఇంతకాలమేం చేయలేదు, ఇప్పుడే చేస్తారా: రోజా

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారకులు వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ కారణంగానే వైయస్ ఆ స్థాయికి ఎదిగారన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కాంగ్రెసు వల్ల వైయస్‌కు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. కేవలం వైయస్ చరిష్మా ఉపయోగించుకోవడానికే ఆయనకు పదవులు కట్టబెట్టిందన్నారు.
కాంగ్రెసులో ఎందరో తలపండిన నేతలు ఉన్నప్పటికీ అధిష్టానం కేవలం వైయస్‌కే అప్పగించడానికి గల కారణం ఆయన చరిష్మాను చూసే అన్నారు. వైయస్‌కు అధిష్టానం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. వైయస్ పథకాలు కాంగ్రెసు పథకాలే అయితే కాంగ్రెసు పాలిత ఇతర రాష్ట్రాలలో ఎందుకు లేవో కిరణ్ సమాధానం చెప్పాలన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు ప్రాతనిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేధీలలో కాంగ్రెసు అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. కిరణ్ నంగనాచిలా మాట్లాడవద్దన్నారు. సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని సాక్ష్యాత్తూ మాజీ డైరెక్టరే చెప్పారని గుర్తు చేశారు.
వైయస్‌కు అధిష్టానం అండదండలు అన్న కిరణ్ ఆయన రెండుసార్లు వరుసగా సిఎంగా ఉన్నారని తెలుసుకోవాలన్నారు. వైయస్ మృతి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య సంవత్సరంలోగా కనిపించకుండా పోయారన్నారు. సోనియా ఆశీర్వాదం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎంత కాలం ఉంటారో తెలియదన్నారు.












Click it and Unblock the Notifications