జగన్‌కు విధేయత, ఆళ్ల నానికి షోకాజ్ నోటీసు

జగన్ వెంట ఆళ్ల నాని వెళ్లడానికి పిసిసి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజు క్రమశిక్షణా రాహిత్యంగా భావించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాత ఆయన ఆళ్లనానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జూన్ 4వ తేదీ లోగా నోటీకుసు సమాధానం ఇవ్వాలని ఆయన ఆళ్ల నానిని ఆదేశించారు. అయితే, దీనిపై మాట్లడడానికి ఆళ్ల నాని అందుబాటులో లేరు. నోటీసులు అందిన తర్వాత తగిన వివరణ ఇస్తామని ఆళ్ల నాని అనుచరులు అంటున్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు రంగారావు కూడా వైయస్ జగన్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు. జగన్‌కు తాను సంఘీభావం తెలిపినట్లు రంగారావు చెప్పారు. దీనిపై పిసిసి క్రమశిక్షణా సంఘం సమీక్షిస్తోంది. కాగా, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిపై పిసిసి ఎఐసిసికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సబ్బం హరి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు.
ఇదిలావుంటే, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కాంగ్రెసు శానససభ్యులు చాలా మంది వస్తారని సబ్బం హరి అన్నారు. ముగ్గురు పార్లమెంటు సభ్యులు జగన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన గత రెండు రోజులుగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తారని భావిస్తున్న శానససభ్యులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications