హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో ఓ రాత్రి: బ్రెడ్, పండ్లు తిన్న జగన్, ఒంటరిగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాత్రి బ్రెడ్, పండ్లు మాత్రమే తీసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో వైయస్ జగన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం ఆయనకు జైలులో ప్రత్యేక బారక్ కేటాయించారు. ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అనంతరం రాత్రి బ్రెడ్, పండ్లు తీసుకున్నారు. తన గదిలో నిద్రించిన జగన్ ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో లేచారు. ఉదయం ఎనిమిది గంటలకు జైలు అధికారులు ఆయనకు వార్తా పత్రికలు చదివేందుకు ఇచ్చారు. ఆ తర్వాత 9.30 గంటలకు ఫలహారం(టిఫిన్) తిన్నారు. రాత్రి జగన్ కొంతసేపు సునీల్ రెడ్డితో ఆంతరంగిక చర్చలు జరిపారు. జగన్ జైలులో ఒంటరిగానే ఉంటున్నారట. జైలు అధికారులతో కూడా మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నారట.

అంతకుముందు జగన్ జైలుకు వెళ్లాక.. అతనిని కలిసేందుకు అతని సతీమణి వైయస్ భారతి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి వచ్చారు. వారు ఐదున్నర గంటలకు వచ్చారు. వారు వచ్చేసరికి ములాఖత్ సమయం ముగిసింది. దీంతో జైలు అధికారులు వారిని జగన్‌ను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో వారు తిరిగి వెళ్లిపోయారు.

మంగళవారం ఉదయం పది గంటలకు ములాఖత్ ఉంటుంది. ఆ సమయంలో వైయస్ భారతి, వైయస్ విజయమ్మ మరికొందరు కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి చెందిన నేతలు జగన్‌ను కలిసేందుకు వచ్చే అవకాశముంది. కాగా జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ ఈ రోజు నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

English summary
YSR Congress Party chief and Kadapa MP YS jaganmohan Reddy took bread and fruits on Monday night as his dinner. He was wakeup 6.30 AM on Tuesday morning and jail officials gave news papers to Jagan at 8.00 AM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X