జగన్ అరెస్టును కొని తెచ్చుకున్నారు: టిజి వెంకటేష్

హైదరాబాద్ చుట్టుపక్కల భూములను వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఆక్రమించుకుని 610 జీవో, 14 ఎఫ్ సమస్యలను సృష్టించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు దోపిడీ చేశారని తాను అనడం లేదని, ఆ సమయాల్లో దోపిడీదారులుఅంటున్నానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. దోపిడీ రెండు రకాలుగా ఉంటుందని, కొంత మంది డబ్బులిచ్చి కొన్నామని అంటారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కారణమని ఆయన అన్నారు. హైదరాబాదు భూముల కబ్జాతో వివాదం సృష్టించారని ఆయన అన్నారు.
త్వరలో జగన్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ సహా అన్ని సమస్యలకు త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిష్కారం చూపుతారని ఆయన అన్నారు. జగన్ అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదని మరో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అన్నారు.
వైయస్ జగన్‌పై మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా విచారణ జరగాలని కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అడ్డు పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి కెసిఆర్ డబ్బులు వసూలు చేశారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ముసుగులో కెసిఆర్ దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికలు అభివృద్ధికి ఆటంకంగా మారాయని ఆయన అన్నారు. త్వరలో తెలంగాణ అంటూ కెసిఆర్ కొత్త డ్రామా ప్రారంభించాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications