రాష్ట్రంలో పెట్రోల్ ధర తగ్గింపు: ముఖ్యమంత్రి చర్యలు

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌పై 33 శాతం పన్ను విధిస్తున్నారు. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వాణిజ్య శాఖ అధికారులను ఆదేశించారు. అయితే, దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి పొందాలని కూడా ఆయన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి అవసరమైంది.
పెట్రోల్ ధర తగ్గింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును తగ్గించి, చర్యలు తీసుకోవాలని ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం పన్నును తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర కాస్తా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ లీటరు ధర 80 రూపాయలకు పైగా ఉంది. దానివల్ల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ అనుమతి లభించిన వెంటనే పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం పన్ను తగ్గింపును అమలులోకి తెస్తుంది. పెట్రోల్ ధర తగ్గింపునకు అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు.
పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా రేపు (గురువారం) భారత్ బంద్ జరగనుంది. ఈ బంద్‌నకు రాష్టం నుంచి తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించాయి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications