వైయస్ జగన్‌కు మద్దతుపై తిరగబడిన బిజెపి వైఖరి

హజారే పోరాటానికి మద్దతిస్తూ జగన్‌ను వెనకేసుకురావటం మంచిదికాదని పలువురు కార్యవర్గ సభ్యులూ సూచించారు. అయినా, జగన్‌కున్న ప్రజాదరణను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ పార్టీ ఆయనపై రాజకీయ కక్షసాధింపు చేపట్టిందని సోమవారం బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇలా మాట్లాడితే పరకాలలో పార్టీ విజయావకాశాలను దెబ్బతీసినట్లేనని రాష్ట్ర శాఖ నివేదించింది.దీంతో మంగళవారం అదే వేదికపై నుంచి మరో అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ జగన్‌ను తీవ్రంగా విమర్శించారు.
వైయస్ జగన్ అరెస్టులో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. జగన్ అరెస్టు కోర్టు ద్వారా జరిగింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కాగా, జగన్ పట్ల బీజేపీ మెతక వైఖరి అనుసరిస్తోందని, బీజేపీ-జగన్ మధ్య పొత్తు ఉంటుందని స్థానికంగా మీడియాలో వార్తలు వెలువడుతున్నాయని, అవన్నీ వాస్తవం కాదని అన్నారు
అవినీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని, దానికి ప్రతిరూపమే జగన్ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. జగన్ అరెస్టు సక్రమమేనని, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రచార ఖర్చులకు సోనియాగాంధీకి సైతం నాడు వైఎస్ ముడుపులు అందజేశారని ఆరోపిస్తూ వాటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కెవిపి రామచందర్ రావుకు తెలియకుండా ఏదీ జరిగేది కాదని, చీమ కూడా కదిలేది కాదని, ఆయనను ఎందుకు విచారించడం లేదని ఆయన అన్నారు. వివాదాస్పద 26 జీవోలపై మంత్రులమీద ఎందుకు చర్యలు తీసుకోలేదని, మోపిదేవి ఒక్కరినే ఎం దుకు అరెస్ట్ చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications