అవే రాళ్లతో కోదండరాంను కొట్టండి: బిజెపిఎల్పీ యెండల

రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్‌గా కోదండరామ్‌ను తెలంగాణవాదులు ఎన్నుకుంటే, వారందరికి ఆయన వెన్నుపోటు పొడిచారన్నారు. జెఏసిని తెరాస జేబు సంస్థ మార్చారని ఆరోపించారు. మూడు నెలల్లో తెలంగాణ రాకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందా అని సవాల్ చేశారు.
కెసిఆర్ ఒత్తిడి మేరకే పరకాల ఎన్నికల్లో తెలంగాణ జెఏసి.. టిఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు జెఏసి పూర్తిగా లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగస్వాములైన తమకు మాటవరసకైనా చెప్పకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పరకాల ఉప ఎన్నికలలో తెలంగాణ రాజకీయ ఐకాస.. తెరాసకు మద్దతిచ్చినా ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని అన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ చేస్తున్నది ధర్మ పోరాటమన్నారు. పార్లమెంటులో 165 మంది ఎంపిల మద్దతు ఉన్న భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుందా లేదా రెండు ఎంపీ సీట్లు ఉన్న తెరాస ద్వారా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications