వైయస్ విజయమ్మను ఒప్పుకుంటున్నా.. కానీ: బాబు

ఉప ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. జగన్ ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కెవిపి రామచంద్ర రావును సిబిఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ప్రచారానికి వచ్చే విజయమ్మను జగన్ అవినీతిపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పులు చేసి ప్రజల ముందుకు వెళితే అవి ఒప్పులు కావన్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మండిపడ్డారు.
వైయస్ జగన్ ఇంటికి కోట్లు తీసుకు వచ్చినప్పుడే విజయమ్మ అడిగి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఐఏఎస్ అధికారులు బాగా పని చేశారని, కాంగ్రెసు హయాంలోనే వారు మారిపోయారన్నారు. తాను తప్పు చేసి ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి వదిలి ఉండేవాడు కాదన్నారు. తనపై ఎన్నో విచారణలు వేసి నిరూపించ లేకపోయారన్నారు. కాంగ్రెసు దొంగ అయితే వైయస్సార్ కాంగ్రెసు గజదొంగ అన్నారు.
ట్యాక్సుల పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలలో పద్దెనిమిది నియోజకవర్గాలలో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యమంటే జగన్, గాలి జనార్ధన్ రెడ్డిలాంటి వాళ్లే అభివృద్ధి చెందే రాజ్యమా అని తెలుగు మహిళా నేత శోభారాణీ.. వైయస్ కూతురు షర్మిళను హైదరాబాదులో ప్రశ్నించారు. వైయస్ హయాంలో రౌడీ రాజ్యం మినహాయిస్తే ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications