భారత్ బంద్: దక్షిణాదిన పాక్షికం, ఉత్తరాన ప్రభావం

చాలాచోట్ల ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద సిపిఎం నేత మధు ఆందోళనకు దిగారు. ఈ బస్ స్టేషన్ నుండి రోజుకు 3600 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు. ధర్నా చేస్తున్న మధుతో సహా పలువుకు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మహబూబ్‌నగర్, అదిలాబాద్ తదితర జిల్లాలలో డిపోల వద్ద బైఠాయించిన వివిధ పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదిలాబాదులో ధర్నా కారణంగా ఐదు డిపోలలోని 596 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడంలో ఆందోళనకారులు ఓ ఆర్టీసి బస్సును ధ్వంసం చేశారు.
హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆబిడ్స్‌లో ధర్నాలో పాల్గొన్నారు. ఎంజిబిఎస్ ధర్నాలో పాల్గొన్న మధు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుమంగా వేతనాలు పెరగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఒక్కసారిగా దాదాపు ఎనిమిది రూపాయలు పెట్రోలు ధర పెంచడంతో అందరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాగే అయితే గ్యాస్ బండను రూ.ఎనిమిది వందలు చేస్తారన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు లొంగి పెట్రోలు ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం మట్టి కొట్టుకు పోతుందన్నారు. కాంగ్రెసు మినహా రాజకీయ పార్టీలు అన్నీ బందును జయప్రదం చేసేందుకు పిలుపునిచ్చాయన్నారు.
దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైకి, రైలు పట్టాల పైకి వచ్చి వాహనాలను, రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications