విజయమ్మకు మేనకా గాంధీ ఫోన్: షర్మిళ ఎదురుదాడి

Maneka Gandhi - Sharmila
న్యూఢిల్లీ/శ్రీకాకుళం/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తోడి కోడలు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ బుధవారం ఫోన్ చేశారు. విజయమ్మకు మేనకా గాంధీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మకు మేనక ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు.

సోనియా గాంధీ వల్ల తానూ ఇబ్బందులు పడ్డానని, ఆమె కుటుంబం మీ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలు తనకు తెలుసునని, ఈ కష్టాలను తాను మాత్రమే కాదని, యావద్భారతం చూస్తోందని, మీరు నిబ్బరంగా కదలండని, ధైర్యంగా ఉండండని, మీ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారట. మీ ఆవేదనలో పాలుపంచుకుంటున్నానని, మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నానని విజయమ్మతో చెప్పారట.

తొలుత విజయమ్మను పలకరించిన మేనకా గాంధీ ఆ తర్వాత కొద్దిసేపు షర్మిళతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకొని తన సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా షర్మిళ నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయమంటే మంచి మనిషిని జైలుకు పంపడం, హెలికాప్టర్‌లను కూల్చడమేనా అని షర్మిళ ప్రశ్నించారు. తల్లి విజయమ్మతో కలిసి ఆమె బుధవారం నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తాను రాజన్న కూతురిని అని, జగన్ చెల్లెల్ని అని పరిచయం చేసుకున్నారు. తన తండ్రి వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడం కోసమే మేం మీ ముందుకు వచ్చామన్నారు. ఈ అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కలిసి.. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మరీ కుట్ర చేస్తున్నాయన్నారు. వైయస్ మంచి మనిషి అని, ఆయన పని తీరు బాగుందని మెచ్చి రెండుసార్లు అధికారం ఇస్తే.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు.

అలాంటి వైయస్, జగన్ పరువు తీయడానికి వీరంతా కుట్ర చేస్తున్నారన్నారు. ఆయన చరిష్మాతో నేడు గద్దెపై ఉన్న పాలకులు ఆయన కుటుంబాన్ని వీధిపాలు చేశారని, తన సోదరుడిని జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా విచారణ జరపుతూ.. జగన్ ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేస్తారని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రచారంలో జగన్ పాల్గొంటే ఓడిపోతామని భావించే ఆయనను జైలుకు పంపించారన్నారు.

జగన్‌ను ప్రజల నుండి దూరం చేసేందుకే జైలుకు పంపించారని, ఇటువంటి నీచ రాజకీయాలు ఎక్కడైనా, ఏనాడైనా చూశామా అని ప్రశ్నించారు. నీతిమాలిన రాజకీయాలకు స్వస్తీ పలికి ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాజన్న రాజ్యం కావాలని కోరినట్టేనని, జగనన్న నిర్దోషిని నమ్మినట్టేనని, ఆయన సిఎం కావాలని కోరుకున్నట్టేనని అన్నారు. కాగా షర్మిళ తన ప్రసంగంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+