చిరంజీవి కలిసినా..: కిరణ్, చంద్రబాబుతో జగన్‌కు పోలిక

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రెండుసార్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యారన్నారు. వైయస్ ఏనాడైనా కాంగ్రెసుకు, సోనియాకు, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారా అని ప్రశ్నించారు. వైయస్ అనే మహా వృక్షాన్ని కాంగ్రెసు పార్టీయే పెంచి పోషించిందని, అలాంటి వృక్షాన్నే కూల్చి వేస్తుందా అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సిబిఐ విచారణనను పొగిడిన వైయస్ కుటుంబం ఇప్పుడు ఎందుకు విమర్శిస్తోందన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వైయస్ హెలికాప్టర్ ప్రమాదం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్మని దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడే వారని, కానీ జగన్ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నారన్నారు.
అబద్దాలు చెప్పేది కేవలం ఇద్దరే అని, ఒకరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోవారు వైయస్ జగన్ అన్నారు. పెంచి పోషించిన కాంగ్రెసు పార్టీని జగన్, చంద్రబాబు మోసం చేశారన్నారు. పిల్లనిచ్చిన మామను బాబు మోసం చేశారన్నారు. పాపం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఆ రోజు బాబు గురించి తెలియదని, అందుకే పిల్లనిచ్చి ఆదరించారన్నారు. కానీ ఆయననే బాబు వెన్నుపోటు పొడిచారన్నారు. జగన్ పైన మోపిన అభ్యంతరాలు రుజువైతే అతనికి పద్నాలుగేళ్ల శిక్ష పడుతుందన్నారు.
జగన్ కూడా కాంగ్రెసును మోసం చేశారన్నారు. ఇద్దరికీ ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక్కొక్కరు పదిమందితో కాంగ్రెసు పార్టీకి ఓట్లు వేయించాలని సూచించారు. తాను చేతులెత్తి మొక్కుతున్నానని కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని, ఈ దృష్ట్యా కాంగ్రెసు అభ్యర్థి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవవాలన్నారు. అంతకు తక్కువ వస్తే అదో విజయమే కాదన్నారు.












Click it and Unblock the Notifications