జగన్ మావాడే: శంకరరావు, బెదిరించాడన్న తులసిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu
Shankar Rao - Tulasi Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మా వాడేనని మాజీ మంత్రి శంకర రావు శుక్రవారం అన్నారు. ఆయన సిఎల్పీ కార్యాలయం బయట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళుతున్న వారంతా తిరిగి కాంగ్రెసు గూటిలోకే వస్తారని చెప్పారు. వెళ్లిన వారంతా వెనక్కి తిరిగి రాక తప్పదన్నారు. జగన్ కూడా తమ వాడే అన్నారు.

ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. ఫలితాల తర్వాత నాయకుడు ఎవరుంటారనేది ప్రధానమైన అంశం కాదని, కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం ఉంటుందని చెప్పారు. కాంగ్రెసు నుండి వెళ్లేవారు ఎవరూ ఉండరన్నారు. కాంగ్రెసు పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉందని చెప్పారు. 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి 127ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారన్నారు.

కాంగ్రెసు పార్టీ లంకా దహనం కాకుండా చూస్తుందని అన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వార్తలు బాగున్నాయి కదా అంటూ మీడియా వారిని ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పొందేందుకు జడ్జి పట్టాభి రామారావుకు రూ.5 కోట్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశించే గాలి వార్తలు బాగున్నాయి కదా అన్నారు.

జడ్జిని డబ్బుతో ప్రలోభ పెట్టేందుకు గాలి జనార్ధన్ రెడ్డితో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని వీర శివా రెడ్డి కడప జిల్లాలో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని చంపేందుకు వైయస్ జగన్, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కలిసి కుట్ర చేసి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైయస్‌ను చంపేసి సిఎం అయ్యేందుకు వారే కుట్ర చేసి ఉంటారన్నారు. దీంతో కాంగ్రెసుకు, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.

2004లో కడప పార్లమెంటు స్థానం వైయస్ వివేకానంద రెడ్డికి కేటాయించవద్దని జగన్ తన తండ్రి పైన ఒత్తిడి తీసుకు వచ్చారని తులసి రెడ్డి అన్నారు. వివేకాకు ఇస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడన్నారు. అప్పట్లో గెలిచినా రాజీనామా చేయించేందుకు ప్రయత్నించాడని మండిపడ్డారు. వైయస్ మృతదేహం పక్కన ఉండగానే తాను సిఎం కావడానికి జగన్ సంతకాలు చేయించారని విమర్శించారు.

వైయస్ మృతిపై అనుమానాలు ఉంటే వైయస్ విజయమ్మ, జగన్, షర్మిళ నాడు సోనియాను కలిసినప్పుడు ఎందుకు అడగలేదన్నారు. జగన్‌కు పదవి ఇవ్వమని అడిగేందుకే కలిశారా అని ప్రశ్నించారు. వైయస్ కుటుంబానిది శవాలపై పేలాలు ఏరుకునే తీరు అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులు ఎన్ని జన్మలెత్తినా కాంగ్రెసు పార్టీ రుణం తీర్చుకోలేరన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Shankar Rao said, YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy is Congress party leader for ever. MLAs will return to Congress, who are going with YS Jaganmohan Reddy now, he added.
Please Wait while comments are loading...