ప్లేఆఫ్స్ లో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్.. నాట్ గుడ్

ఐపీఎల్ ప్లేఆఫ్స్ నేడు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరుకుంటుంది. ఓడిన జట్టు అవకాశం లభిస్తుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టును ఢీ కొడుతుంది.

ప్లేఆఫ్స్ లో అందరి చూపూ రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే నిలిచింది. దీనికి కారణాలు లేకపోలేదు. ప్లేఆఫ్స్ లల్లో అతని ట్రాక్ రికార్డు ఏమంత బాగుండట్లేదు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ దిగ్గజ ఆటగాడే అయినప్పటికీ.. ప్లేఆఫ్స్‌లో విఫలమౌతున్నాడు. అతని స్థాయికి తగినట్లుగా ఉండట్లేదు. మొత్తం టోర్నమెంట్‌లో 9,218 పరుగులు, 67 అర్ధ సెంచరీలతో ఆధిపత్యం చెలాయించిన కోహ్లీ ప్లేఆఫ్స్‌కు వచ్చేటప్పటికి చతికిలపడుతున్నాడు.

Virat Kohli IPL Legend With Stellar Numbers Yet Playoff Struggles Define His Record Haunts Finals

ఇప్పటివరకు 17 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 26.4 మాత్రమే. 396 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓ డకౌట్ కూడా రికార్డయింది. ఐపీఎల్ లో మొత్తం 281 మ్యాచ్‌లల్లో కోహ్లీ 9,218 పరుగులతో పాటు 9 సెంచరీలు, 67 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని 40.07 సగటు, 134.39 స్ట్రైక్ రేట్‌తో అతని గణాంకాలు అమోఘం. ఈ స్థాయి ప్రదర్శన ప్లేఆఫ్స్ లో ఉండకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది.

వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే, ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను 14 ఇన్నింగ్స్‌లలో 50.63 సగటుతో 557 పరుగులు సాధించాడు. అతని అత్యుత్తమ స్ట్రైక్ రేట్ 163.82. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు, సెంచరీలు, అర్ధ సెంచరీలు సాధించిన రికార్డులు కోహ్లీ పేరిటే ఉన్నాయి.

మరోసారి ఫైనల్‌కు చేరడానికి కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడుతుంది ఆర్సీబీ. ఈ సీజన్ ప్లేఆఫ్స్ లల్లో కోహ్లీ ఎలా ఆడతాడనేది చర్చనీయాంశమౌతోంది. లీగ్ దశ మాదిరిగా చెలరేగితే ఆర్సీబీ విజయాల పరంపరకు అడ్డు అనేది ఉండకపోవచ్చు. గత ఏడాదిలా కాకుండా ఈ సీజన్ లో కోహ్లీ మరింత ప్రభంజనం రేపాలని ఆర్సీబీ కోరుకుంటోంది. అది ఎంత వరకు నెరవేరుతుందనేది ఈ సాయంత్రం తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+